ఖుర్ఆన్ బహుకరించండి

అనంత కరుణామయుడు అపార కరుణాప్రదాత అయిన అల్లాహ్ పేరుతో

((అల్'హమ్దు లిల్లాహి రబ్బిల్ 'ఆలమీన్, అల్ ఖాఇ'లు ఫి కితాబిహిల్ కరీమ్:))
"సమస్త స్తోత్రాలకు అర్హుడు అల్లాహుత'ఆలా మాత్రమే. ఆయన తన గ్రంథంలో అన్నాడు":
((ఖద్ జాఅ'కుమ్ మిన్ అల్లాహి నూరున్ వ కితాబున్ ముబీన్.))
"వాస్తవంగా మీ కొరకు అల్లాహ్ నుండి ఒక జ్యోతి మరియు ఒక స్పష్టమైన గ్రంథం (ఖుర్ఆన్) వచ్చి వున్నది."
సూరహ్ అల్-మాఇ'దహ్, 5:15

ఆదరణీయులైన ప్రవక్తల, సందేశహరుల అందరి పై మరియు మన సందేశహరుడైన ముహమ్మద్ పై శాంతి మరియు శుభాలు వర్షించుగాక! మహా ప్రవక్త ('స'అస) అన్నారు:


(('ఖైరుకుమ్ మన్ త'అల్లమ అల్-ఖుర్ఆన వ 'అల్లమహ్))
"మీలో ఖుర్ఆన్ ను నేర్చుకొని, దానిని (ఇతరులకు) నేర్పేవారు, ఉత్తములు."

ఇతర దివ్య గ్రంథాలన్నీ ఒక్కొక్క సమాజం కొరకే అవతరంపజేయబడ్డాయి, కాని ఖుర్ఆన్ మాత్రం సర్వ సృష్టి కొరకు అవతరింపజేయబడిందని అల్లాహుత'ఆలా అంటున్నాడు:

((వ మా అర్సల్నాక ఇల్లా ర'హ్మతల్ లిల్ 'ఆలమీన్))
"మరియు మేము నిన్ను (ఓ ప్రవక్తా!) సర్వలోకాల వారికొరకు కారుణ్యంగా మాత్రమే పంపాము.
"సూరహ్ అల్-అంబియాఅ', 21:107.

మహా ప్రవక్త (సఅస) అన్నారు:

((బల్లి'గూ 'అన్ని వలవ్ ఆయహ))
"ఒక్క ఆయత్ అయినా సరే, నా తరఫు నుండి వచ్చింది, (ప్రజలకు) అందజేయండి."

అంటే అల్లాహుతా'ఆలా సందేశాన్ని ప్రజలకు అందజేయటం, కేవలం విద్వాంసుల (ఉలమాల) బాధ్యత మాత్రమే కాదన్నమాట. కాబట్టి అల్లాహుతా'ఆలా సందేశాన్ని, తనకు తెలిసినంతమట్టుకు, ప్రజలకు అందజేయటం ప్రతి ముస్లిం భాధ్యత!

అల్లాహుతా'ఆలా పంపిన ప్రవక్తలలో, ము'హమ్మద్ ('స'అస) చిట్టచివరి ప్రవక్త కాబట్టి అతని పై అవతరింపజేయబడిన ఖుర్ఆన్ కూడా అంతిమ దివ్య గ్రంథం, చూడండి ఖుర్ఆన్:

((మా కాన ము'హమ్మదున్ అబా అ'హదిమ్ మిన్-రిజాలికుమ్ వలాకిన్ రసూలల్లాహి వ 'ఖాతమన్నబియ్యీన్))
"(ఓ మానవులారా!) ము'హమ్మద్ మీ పురుషుల్లో ఎవ్వడికీ తండ్రికాడు, కాని అతను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చివరివాడు."   సూరహ్ అల్-అ'హ్ జాబ్, 33:40

కాబట్టి, ము'హమ్మద్ ('స'అస) తరువాత, ఎవడైనా మరొక ప్రవక్త వచ్చాడు లేదా తాను ప్రవక్తను అని అంటే అతడు పచ్చి అబద్ధాలమారి. కావున ము'హమ్మద్ ('స'అస) పై అవతరింపజేయబడిన ఖుర్ఆన్ చిట్టచివరి దివ్య గ్రంథం. దీని తరువాత ఇక దివ్య గ్రథం అవతరింపజేయబడదు. కావున అల్లాహుతా'ఆలా, దీనిని పునరుత్థాన దినం వరకు దీని అసలు రూపంలో (స్థితిలో) ఉంచుతానని వాగ్దానం చేశాడు, చూడండి, ఖుర్ఆన్:

((ఇన్నా న'హ్ను న'జ్జల్నజ్జి'క్ర వ ఇన్నా లహు ల'హాఫి'జూన్))
"నిశ్చయంగా, మేమే ఈ జ్ఞాపిక (ఖుర్ఆన్)ను అవతరింపజేసినవారము మరియు నిశ్చయంగా, మేమే దీనిని కాపాడేవారము."  సూరహ్ అల్-'హిజ్ర్, 15:9

అందుకే, అవతరింపజేయబడిన >1430 సంవత్సరాల తరువాత కూడా, ఒక్క అక్షరపు మార్పు రాకుండా భద్రంగా ఉన్న దివ్య గ్రంథం కేవలం ఖుర్ఆన్ మాత్రమే. ఈ రోజు ప్రపంచంలో ఏ దివ్య గ్రంథం కూడా దాని అసలు (అవతరింపజేయబడిన) రూపంలో లేదు. ఉదాహరణకు: బైబిల్ లో ఎన్నోసార్లు మార్పులు చేయబడ్డాయి.

ఇక హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతనే తీసుకొండి: దాదాపు 32 రకాల భగవద్గీతలు చెలామణిలో ఉన్నాయి.
ఇతర గ్రథ ప్రజలు, తమ ధర్మ ప్రచారం కొరకు రేయింబవళ్ళు పాటుపడుతున్నారు. ఉదాహరణకు: క్రిష్చియన్ లు.
హోటల్ రూములలో మరియు చిన్నచిన్న గ్రామాలలో కూడా మనకు బైబిల్ కనిపిస్తుంది.
అయితే ఖుర్ఆన్ ఎందుకు లభించగూడదూ?
క్రిష్చియన్ మిషినరీ పాఠశాలలు చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఉన్నాయి.
అయితే ముస్లిం సంస్థల ఆధునిక పాఠశాలలు ఎన్ని ఉన్నాయి?
క్రిష్చియన్ మిషినరీ ఆసుపత్రీలు చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఉన్నాయి.
అయితే ముస్లిం సంస్థల ఆసుపత్రీలు ఎన్ని ఉన్నాయి?
క్రిష్చియన్ మిషినరీ టీ.వీ. చానెల్స్ ఎన్నో ఉన్నాయి.
అయితే ముస్లిం సంస్థల టీ.వీ. చానెల్స్ ఎన్ని ఉన్నాయి?
ఇతర గ్రంథ ప్రజలు - వాటి సందేశాలు, ఎన్నో సార్లు మార్పు చేయబడి, వాటిలో ఎన్నో అసత్య విషయాలు ఉన్నా - తమ ధర్మ (సందేశాల) ప్రచారంలో కఠినంగా పాటుపడుతున్నారు.
అయితే మనం నిద్రపోతున్నామా?
ఏమీ? మనం అల్లాహుతా'ఆలా యొక్క సత్య సందేశాన్ని వ్యాపింపజేయడంలో క్రిష్చియన్స్ ల వలే పాటుపడుతున్నామా??
లేకుంటే, దీనికి కారణమేమిటి??
ఫ్రపంచంలో ఎంతమంది క్రిష్చియన్లు ఉన్నారు?
అయితే ముస్లింలు ఎంతమంది??
ఇంచుమించు సమానమే!
అయితే సత్యసందేశాన్ని అందజేయటంలో మనం వెనుక ఉండిపోవడానికి కారణమేమిటి?
ఏమీ? మేము అంతమట్టుకు దరిద్రులమా? మేము ప్రతి సంవత్సరం ఒక్క ఖుర్ఆన్ కూడా బహూకరించలేమా?
బైబిల్ ఎన్ని భాషలలోకి అనువదింపబడిందో తెలుసా?
438 భాషలలో పూర్తి బైబిల్ మరియు 2454 భాషలలోకి దాని భాగాలు!
అయితే ఖుర్ఆన్ ఎన్ని భాషలలోకి అనువదింపబడింది??
ఇంతవరకు కేవలం 102 భాషలలోకి మాత్రమే!
ఎందుకు ఇంత తక్కువ? దీనికి బాధ్యులెవరు??
బైబిల్ ఎవరు పంచుతున్నారు? ఎన్. జి. ఓలు!
మహా కార్యాన్ని నిర్వహించడం ఒక్క మానవునికి చేతకాని పని!
ఏమి? అల్లాహుతా'ఆలా సందేశాన్ని వ్యాపింపజేయడం మనందరి కర్తవ్యం కాదా?
అల్లాహుతా'ఆలా ఆదేశానుసారంగా అది మనందరి విధి. చూ. ఖుర్ఆన్:

((1. వల్-'అ'స్రి! 2. ఇన్నల్ ఇన్సాన లఫీ 'ఖుస్రిన్,
3. ఇల్లల్లజీ'న ఆమనూ వ 'అమిలు'స్సాలిహాతి వతవా'సవ్ బిల్హఖ్ఖి వతవా'సవ్ బి'స్సబ్రి!))

"1. కాలం ('అ'స్ర్) సాక్షిగా! 2. నిశ్చయంగా, మానవుడు నష్టంలో ఉన్నాడు. 3. విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు మరియు ఒకరికొకరు సత్యాన్ని బోధించుకునేవారు మరియు ఒకరికొకరు సహనాన్ని (స్థైర్యాన్ని) బోధించుకునేవారు తప్ప!"
సూరహ్ అల్-'అ'స్ర్, 103:1-3.

1405 హిజ్రిలో స్థాపించబడినప్పటి నుంచి, 'మలిక్ ఫహద్ ఖుర్ఆన్ ప్రింటింగ్ కాంప్ లెక్స్' మదీనా మునవ్వరా వారు ఎన్ని ఖుర్ఆన్ కాపీలు పంచారు?
ఏమీ? ఇంత పెద్ద కార్యం నెరవేర్చటం కేవలం వారి బాధ్యతేనా?
ఎన్ని క్రిష్చియన్ ఎన్. జి. ఓ. శాఖలు పనిచేస్తున్నాయి?
మరియు ఎన్ని ముస్లిం ఎన్. జి. ఓ. శాఖలు పనిచేస్తున్నాయి??
ప్రతి ముస్లిం, ప్రతి సంవత్సరం, కేవలం ఒక్క ఖుర్ఆన్ మాత్రమే, ముస్లిమేతరులకు బహూకరిస్తే, తన జీవిత కాలంలో ఎన్ని ఖుర్ఆన్ లు పంచగలడు? దాదాపు 60 కదా!
ఒకవేళ ప్రపంచంలోని ప్రతిముస్లిం నాగరికుడు, ప్రతిసంవత్సరం కేవలం ఒక్కఖుర్ఆన్ కాపీ మాత్రమే బహూకరిస్తే, ఐదు సంవత్సరాలలో, మనం ప్రపంచవాసులకందరికీ ఖుర్ఆన్ అనువాదాలు అందజేయగలం కదా!
వారు ఖుర్ఆన్ చదివి, సన్మార్గులైతే అల్హమ్దులిల్లాహ్!
ఒకవేళ వారికి సన్మార్గపు భాగ్యం దొరక్కపోయినా, మనం మన కర్తవ్యం నిర్వహించాము కదా! వారు కనీసం ఖుర్ఆన్ చదివితే, ఇస్లాంను అసహ్యించుకోరు. ఖుర్ఆన్లో ముస్లిమేతరుల పట్ల ద్వేష భావాలు రేకెత్తించే విషయాలు లేవు, అని, అది కేవలం సన్మార్గం మీద నడుచుకొని శాశ్విత సుఖం పొందే మోక్షపు మార్గానికి దారి చూపుతొందని తెలుసుకుంటారు.

అల్లాహుతా'ఆలా ఆదేశం:
((వ మన్ యహ్దిల్లాహు ఫమా లహూ మిన్ ము'దిల్ల్))
"మరియు అల్లాహ్ మార్గదర్శకత్వం చేసిన వానిని మార్గభ్రష్టుడు చేయగలవాడు ఎవ్వడూ లేడు."
సూరహ్ అజ్-'జుమర్, 39:37.

కాబట్టి మన కర్తవ్యం కేవలం అల్లాహుతా'ఆలా సందేశాన్ని అందజేయడమే!
ఏమీ? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ స్నేహితుల ప్రసన్నత కొరకు మీరెంత ఖర్చుపెడుతున్నారో?
అయితే, మీ ప్రభువు ప్రసన్నత కొరకు ప్రతి సంవత్సరం ఎంత ఖర్చుపెడుతున్నారు?
ఇది కేవలం ఒక జ్ఞాపిక, అల్లాహుతా'ఆలా పట్ల మీ బాధ్యతను మీరెంతమట్టుకు నేరవేర్చుతున్నారో ఆలోచించండి!
కాబట్టి మరువకుండా ప్రతి సంవత్సరం కనీసం ఒక్క ఖుర్ఆన్ బహూకరించండి!
మహా ప్రవక్త ('స'అస) ఖుర్ఆన్ వినిపించి ఇస్లాం ప్రచారం చేశారు కదా!
దా'వా చేయటానికి మన దగ్గర సమయం లేకపోవచ్చు!
మనలో ప్రతి ఒక్కడు మంచి సంభాషకుడు కాకపోవచ్చు!
కాని, ప్రతి ఒక్కడు కనీసం సంవత్సరానికి ఒక్క ఖుర్ఆన్ మాత్రం తప్పక బహూకరించగలడు!
కాబట్టి, ఇతరులు ఖుర్ఆన్ పంచితేనే, తీసుకొని చదువుదామని వేచిఉండక;
ముస్లిమేతరులకు కనీసం సంవత్సరానికొక ఖుర్ఆన్ బహూకరించడం, మీ కర్తవ్యంగాన చేసుకోండి!

ోదసోదర సరీమణులారా!!!
మేము 'దివ్య ఖుర్ఆన్ సందేశం' అనే పేరుతో తెలుగులో ఖుర్ఆన్ అనువాదాన్ని ఆంధ్ర దేశంలో పంచటానికి యోజన ప్రారంభించాము. ఆంధ్ర ప్రదేశ్ జనసంఖ్య దాదాపు ఎనిమిది కోట్లు.

నేను డాక్టర్ను. నెఫ్రాలోజిష్ట్ గా, స'ఊదీ 'అరేబియా, మక్కాలో 35 సంవత్సరాల నుండి, ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్నాను. ప్రతిరోజు, డ్యూటీ పూర్తి అయిన తరువాత, సాయంత్రం 5-6 గంటలు, కూర్చొని, >12 సంవత్సరాలు కఠినంగా పాటుపడి ఖుర్ఆన్ అనువాదాన్ని పూర్తిచేశాను. దానిని ఆంధ్ర ప్రదేశంలో ప్రతిగ్రామంలో చేర్చాలని మా అభిలాష. నా అనువాదపు విశేషమేమిటంటే, ఇది నేరుగా అరబ్బీనుండి తెలుగులోకి చేయబడిన మొట్టమొదటి తెలుగు అనువాదం. వీలైనంతవరకు నేను ప్రతి అరబ్బీ పదానికి ఒక ప్రత్యేక తెలుగు పదం వాడాను. ఆయతులను, వేరువేరుగా అనువదించాను. ఆయతులను, వాటి మొదటి మరియు తరువాత వచ్చే ఆయతులతో ఉన్న సంబంధాన్ని తెగనియ్యకుండా, వాటిని వేరువేరుగా అనువదించాను. వీలైనంతవరకు సూటియైన విరామ చిహ్నాలను వాడాను. కొంత తెలుగు భాష వచ్చినవాడు కూడా చదువగలిగేట్లు, సరళమైన తెలుగుభాషను ఉపయోగించాను. అవసరమున్నచోట్లలో సంక్షిప్త వ్యాఖ్యానాలు కూడా వ్రాశాను. ఇస్లాం అంటే ఏమిటీ? అల్లాహుతా'ఆలా మానవులను పుట్టించిన ఉద్దేశ్యం ఏమిటి? శాశ్విత సుఖాల, శాశ్విత స్వర్గజీవితం పొందటానికి అల్లాహుతా'ఆలా చూపిన మార్గం ఏమిటి? అనే విషయాలను, సాధారణ మానవులు, సులభంగా తెలుసుకునాలనే ఉద్దేశంతో సులభమైన తెలుగులో అనువదించాను. ఈ అనువాదాన్ని, తెలుగుభాషలో నిపుణతగల ఐదుమంది ముస్లిం ఉలమాలు పునర్విమర్శన చేశారు.

నా ఈ'దివ్య ఖుర్ఆన్ సందేశం,' అనువాదాన్ని మలిక్ ఫహద్ ఖుర్ఆన్ ప్రింటింగ్ కాంప్లెక్స్, మదీనా మునవ్వరా వారు కూడా, ప్రచురించారు. ఇంతవరకు మేము 30,000 కాపీలు, ఇండియాలో ప్రచురించి పంచాము.

ప్రస్తుతం మేము ఆంధ్రప్రదేశ్ లోని, ప్రతి గ్రామాధికారికి (సర్పంచ్ కు) ఒకటి మరియు ప్రతి మస్జిద్ కు ఒక కాపి పంచడం ప్రారంభించాము. గ్రామాధికారులు ఎంతో శ్రద్ధతో స్వీకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశంలో దాదాపు 78,000 వేల గ్రామాలు ఉన్నాయి. కాబట్టి మాకు కనీసం 100,000 కాపీల అవసరం ఉంది.

ఇంత పెద్ద కార్యం మా ఒక్కరితో పూర్తి అయ్యేపని కాదు. కాని మీరంతా ఆర్థికంగా సహాయపడితే మేమీ మహాకార్యాన్ని అల్లాహుతా'ఆలా అనుగ్రహంతో పూర్తిచేయవచ్చు!

ఒక ఖుర్ ఆన్ ప్రింటు ఖర్చు 200/- రూపాయిలు మాత్రమే.

ఆంధ్రప్రదేశంలో పూర్తిచేసిన తరువాత, భారతదేశపు ఇతర రాష్ట్రాలలో, ఆ తరువాత పూర్తి ప్రపంచంలో దివ్య ఖుర్ఆన్ అనువాదాన్ని, వారి వారి భాషలలో, ప్రజలకందరికీ పంచాలని మా ఉద్ద్యేశం.

మా ఈ సద్భావనను పూర్తి చేయమని అల్లాహుతా'ఆలాను వేడుకుంటున్నాము!
మా చివరి ప్రార్థన సర్వ స్తోత్రాలకు అర్హుడు సర్వలోకాల ప్రభువైన అల్లాహుతా'ఆలా మాత్రమే!


మీ సోదరుడు:
డా. అబ్దుల్ రహీమ్ మౌలానా
అనువాదకుడు: దివ్య ఖుర్ ఆన్ సందేశం
ప్రెసిడెంట్: అల్-ఫలఖ్ ఎజుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్
AL-FALAQ (SHANTHI KIRANALU) Educational & Charitable Trust   Registered Charity,
H.No. 2-6-7/MAK/A/506, Upperpally, Rajendernagar Hyderabad- 500028, A.P.
Ph: +91-9652468568, Saudi Arabia: +966 503529194   Email: telquran@gmail.com, info@telugu-quran.com


AL-FALAQ (SHANTHI KIRANALU) Educational & Charitable Trust   Registered Charity, H.No. 2-6-7/MAK/A/506, Upperpally, Rajendernagar Hyderabad- 500028, A.P.
Ph: +91-9652468568, Saudi Arabia: +966 503529194   Email: telquran@gmail.com, info@telugu-quran.com